Mobile Popup Ad
Mobile Popup Ad

నేడు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర విచారణ కమిటీ

కలం, వెబ్ డెస్క్: నేడు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ఉన్నతస్థాయి విచారణ కమిటీ రానుంది. బొకోరో స్టీల్ ప్లాంట్ సీనియర్ డైరెక్టర్ ఆధ్వర్యంలో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. స్టీల్ మెల్ట్ షాప్ విభాగంలో లాడిల్ పేలుడు, భారీ ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీసిన కారణాలపై ఈ కమిటీ విచారణ చేపట్టనుంది. దేశీయ స్టీల్ ఇండస్ట్రీ ప్రమాదాల్లో ఇలాంటి దుర్ఘటన ఎప్పుడూ జరగలేదని నిపుణులు చెబుతున్నారు. ఘటనాస్థలిని పరిశీలన చేసి 15 రోజుల్లో ప్రమాద నివేదికను కేంద్రానికి కమిటీ సమర్పించనుంది. ముడి పదార్థాలు నాణ్యత విభాగాల్లో పని చేస్తున్న సిబ్బంది నైపుణ్యం సహా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కమిటీ కి కేంద్రం నిర్దేశించింది.

స్టీల్ ప్లాంట్‌లో 30 ఏళ్ళ నాటి మిషనరీ సహా సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవుతున్న పరిస్థితులపై ఆరా తీయనుంది. రెండు నెలల వ్యవధిలో 27 సార్లు లాడెల్ కు రంద్ర పడి ద్రవ ఉక్కు నేలపాలు అయినట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి. దానిపై కూడా కమిటీ విచారణ చేయనుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా.. ఏడుగురు క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతుంది. మృతుల్లో ఐదుగురు స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు, ముగ్గురు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ప్రమాద ఘటనపై BNS 194 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. స్టీల్‌ప్లాంట్‌లో 1500 డిగ్రీల వేడి కలిగిన స్టీల్​ మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది.

ముగ్గురి మృతదేహాలు గుర్తింపు..

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాద ఘటన (Vizag Steel Plant Explosion)లో ముగ్గురి మృతదేహాలు గుర్తించారు. ప్రమాదంలో చనిపోయిన భానుకుమార్, రమణ, అప్పలరాజు మృతదేహాలను అధికారులు గుర్తించారు. మిగిలినవారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో డీఎన్ఏ పరీక్షల కోసం బాధిత కుటుంబాల నుంచి నమూనాలు సేకరిస్తున్నారు. సేకరించిన డీఎన్ఏ నమూనాలను కేజీహెచ్ సిబ్బంది విజయవాడ ల్యాబ్‌కు పంపున్నారు. మృతదేహాల గుర్తింపు తర్వాత, బంధువులకు అప్పగించనున్నారు. మృతదేహాలను స్వస్థలాలకు తరలింపునకు అధికారులు వాహనాలు సిద్ధం చేశారు. ప్రమాదం జరిగిన అనంతరం విశాఖ స్టీల్​ ప్లాంట్​ ప్రమాద మృతదేహాలను కేజీహెచ్‌లో భద్రపరిచి పోస్ట్ మార్టం నిర్వహించారు. జిల్లా అధికారులు మృతుల బంధువులకు సమాచారం అందించారు. సమాచారం కోసం విశాఖ కలెక్టరేట్​లో టోల్​ ఫ్రీ నెంబర్​ను ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆరుగురిలో ముగ్గురికి కిమ్స్​లో, మరో ముగ్గురికి సెవెన్​ హిల్స్​ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>