నేరడిగొండలో గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్!

కలం, నేరడిగొండ : పత్తి పంటలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని నేరడిగొండ (Neradigonda) పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. బోరిగాం గ్రామానికి చెందిన ఆడే కపిల్ అనే వ్యక్తి తన వ్యవసాయ భూమిలో పత్తి పంట మధ్యలో అక్రమంగా గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టి గంజాయి మొక్కలను గుర్తించారు. ఈ సందర్భంగా 4 నుంచి 5 అడుగుల ఎత్తు పెరిగిన 125 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.12.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుడిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఇచ్చోడ రూరల్ సీఐ సీహెచ్ రమేశ్​ తెలిపారు. గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>