కలం, కరీంనగర్ బ్యూరో: వడదెబ్బ(Sunstroke)తో ఓ క్యాబ్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కరీంనగర్‌లో చోటు చేసుకున్నది. కట్నపల్లి గ్రామానికి చెందిన మాడురీ నరేందర్ (42) విద్యానగర్‌లో నివాసం ఉంటూ జీవనోపాధి కోసం క్యాబ్‌డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మూడ్రోజుల క్రితం వడదెబ్బ తగలడంతో కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. కాగా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. నరేందర్‌కు భార్య, ఇద్దరు ఆడపిల్లలు మైథిలి ప్రియ, వన్మయి ప్రియ ఉన్నారు . నరేందర్ మృతితో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. నరేందర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బంధు మిత్రులు కోరుతున్నారు.

