Mobile Popup Ad
Mobile Popup Ad

బూర్గంపాడులో ఘనంగా కళ్యాణలక్ష్మి, సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ!

కలం, బూర్గంపాడు : పేదింటి బిడ్డల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం బూర్గంపాడు (Burgampadu ) మండల కేంద్రంలోని వాసవి ఫంక్షన్ హాల్ నందు లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అర్హులైన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ​

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సాధారణంగా సామాన్య కుటుంబాలలో శుభ, అశుభ కార్యక్రమాలు జరిగినప్పుడు ఆయా కుటుంబాలు ఆర్థికంగా తీవ్రంగా వెనుకబడిపోతాయని, దీనికంతటికీ పేదరికమే ప్రధాన కారణమని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో నిరుపేదల అవసరాల నిమిత్తం, ఆయా కుటుంబాలు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతోనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఆయన పేర్కొన్నారు.

​పినపాక నియోజకవర్గ పరిధిలో నేడు 34 కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులతో పాటు 25 సీఎం సహాయనిధి చెక్కులను అర్హులైన పేదలకు అందించినట్లు ఆయన తెలిపారు. మొత్తం 13 లక్షల రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సాయం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రస్తుత ప్రజా పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు. తమకు అండగా నిలిచిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>