గౌడన్నల నుంచి మామూళ్లు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై శ్రీనివాస్ గౌడ్ ఫైర్!

కలం, మెదక్ బ్యూరో: రాష్ట్రంలో 46 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గీత కార్మికుల నుంచి ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారని, ఒక్కో ఎమ్మెల్యే నెలకు 15 లక్షల నుండి 20 లక్షల వరకు మామూళ్లు తీసుకుంటున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) తీవ్ర ఆరోపణలు చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో కల్లుగీత సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గీతన్నల చైతన్య యాత్ర’ కార్యక్రమoలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై, ప్రసంగించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గీత కార్మికులు తీవ్ర వేధింపులకు గురవుతున్నారని, ఎమ్మెల్యేలకు లంచాలు ఇవ్వకపోతే కల్లు షాపులను బలవంతంగా బంద్ చేయిస్తున్నారని, అక్రమ కేసుల పేరుతో వేలాది మంది గౌడ కులస్తులను జైలుకు పంపుతున్నారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కల్తీ కల్లు నెపంతో గౌడన్నలను వేధిస్తున్న అధికారులు, రాజకీయ నాయకులను వదిలిపెట్టేది లేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఒక్కొక్క కొడుకును వంగబెట్టి పండబెడుతామని పరుష పదజాలంతో హెచ్చరించారు.

రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ మంత్రి ఏం చేస్తున్నారని, ఆయనకు ఇవేమీ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తక్షణమే మామూళ్ల వసూళ్లను నిలిపివేసి, గౌడన్నలకు ఎక్సైజ్ మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>