కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి కుమార్తె కొత్త స్కూల్ ఏర్పాటు చేస్తే.. తానేమైనా తక్కువనా అని మంత్రి పొంగులేటి (Minister Ponguleti) తన కుమార్తె సప్ని రెడ్డితో కొత్త స్కూల్ పెట్టేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ (Manne Krishank) ఆరోపించారు. మావ్ ఎడ్యూ పేరుతో పెద్ద ఎత్తున కార్పొరేట్ స్కూల్స్ స్థాపించేందుకు ప్రకటనలు కూడా ఇచ్చేస్తున్నారని విమర్శించారు. సర్కార్ బడులు, ఆసుపత్రులను పట్టించుకోని రేవంత్, పొంగులేటి.. వాళ్ల కుమార్తెలతో కార్పొరేట్ స్కూల్స్ స్థాపించుకుంటూ వ్యాపారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి కుమార్తె స్థాపించిన మైండ్ వాల్ట్ స్కూల్‌లో ఏడాదికి రూ.2.5 లక్షల ఫీజులు వసూళ్లు చేయబోతున్నారని క్రిశాంక్ వివరించారు. తెలంగాణలో ఇంతవరకు ఆర్ఆర్ ట్యాక్స్‌తో పాటు పీఆర్ ట్యాక్స్ (పొంగులేటి రాఘవ) నడుస్తోందన్నారు. రేవంత్, పొంగులేటి కాంట్రాక్టులను కేకును కోసినట్లు సమానంగా పంచుకుంటున్నారని ఆరోపించారు.
మెటా కార్యాలయంపై దాడి చేస్తారా..?
హైదరాబాద్‌లోని ఫేస్‌బుక్ మెటా కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ లీడర్లు దాడి చేయడం దారుణమని క్రిశాంక్ (Manne Krishank) ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా తరువాత ఫేస్‌బుక్ అతి పెద్ద క్యాంపస్.. హైదరాబాద్‌లోనే కేసీఆర్ హయాంలో స్థాపించారన్నారు. ఇలా జరిగితే ప్రపంచ స్థాయి పెట్టుబడులు ఎలా వస్తాయన్నారు. రాహుల్ గాంధీ దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సోషల్ మీడియా అకౌంట్లను సస్పెండ్, బ్లాక్ చేస్తే న్యాయపరంగా చర్యలు తీసుకోవచ్చన్నారు. ఇలా కార్యాలయాలపై దాడులకు పాల్పడుతారా.. అని మండిపడ్డారు. పెట్టుబడిదారులు రావొద్దనేదే రేవంత్ రెడ్డి ఆలోచన అని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఒక్క కార్యాలయంపై కూడా రాయి కూడా వేయలేదన్నారు.
Also Read : ఇందిరమ్మ బీమాకు మార్గదర్శకాలు విడుదల
Follow Us On : WhatsApp

