కలం, వెబ్‌డెస్క్: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని కూల్చివేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు నెక్కొండ మండలంలోని నూరిపల్లిలో ఆందోళన చేపట్టారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి (MLA Donthi Madhava Reddy) శవయాత్ర నిర్వహించి ఆయన దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాజకీయ కక్షసాధింపులతోనే పెద్ది విగ్రహాన్ని తొలగించారని నాయకులు ఆరోపించారు. మరోవైపు అధికారులు మాత్రం అనుమతి లేని కారణంగానే విగ్రహాన్ని తొలగించినట్లు చెప్తున్నారు. కానీ, బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ ముఖ్య నేతలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.
Also Read : కేసీఆర్‌ది దొరల న్యాయం.. నాది సామాజిక న్యాయం: సీఎం రేవంత్
Follow Us On: X(Twitter)

