బీఆర్ఎస్ vs కాంగ్రెస్.. హనుమకొండలో హై టెన్షన్!

కలం, వెబ్ డెస్క్: హనుమకొండ (Hanumakonda)లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్ పీక్స్‌కు చేరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ పర్యటనపై పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. దీనికి మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కౌంటర్ ఇవ్వడంతో రాజకీయ వేడి రాజుకుంది. ఈ క్రమంలో మంగళవారం సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య.. బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. దీన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించడంతో ఘర్షణ చోటు చేసుకుంది.

ఈ సందర్భంగా కోడి గుడ్లతో దాడులు చేసుకున్నారు. క్యాంపు కార్యాలయం వద్ద వినయ్ భాస్కర్ ఫ్లెక్సీలను కాంగ్రెస్ నాయకులు చించేశారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులను మోహరించారు. నాయిని రాజీనామా చేసి గెలిస్తే.. తాను రాజకీయాలకే గుడ్ బై చెబుతానని వినయ్ భాస్కర్ సవాల్ చేశారు. ప్రస్తుతం క్యాంపు కార్యాలయం లోపలికి ఎవరు వెళ్లకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>