Mobile Popup Ad
Mobile Popup Ad

ఓటుకు నోటు కేసు కూడా బయటకు తీయాలి: అరవింద్

కలం, మెదక్ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కోసం ఆరు నెలల క్రితం సీబీఐకి ఇస్తే కేంద్రం పట్టించుకోవడం లేదని.. కిషన్ రెడ్డిని అడగండి అని రేవంత్ రెడ్డి చెబుతున్నాడు. కాళేశ్వరం విచారణతో పాటు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు కూడా బయటకు తీసి, కేసు వేగం పెంచాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కోరారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Arvind).

కాళేశ్వరం అవినీతి, ఈ కార్ రేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులలో రేవంత్ రెడ్డి వేల కోట్లు తీసుకొని చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ఏం మొఖం పెట్టుకొని మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Arvind) పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>