పెండింగ్‌లోనే త‌ల్లికి వంద‌నం నిధులు: బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

క‌లం, వెబ్ డెస్క్‌: రాష్ట్రంలో ఇప్ప‌టికీ చాలామందికి త‌ల్లికి వంద‌నం నిధులు అంద‌లేద‌ని ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ (Botsa Satyanarayana) ఆరోపించారు. బుధ‌వారం అసెంబ్లీ వేదిక‌గా గ‌వ‌ర్న‌ర్ చేసిన ప్ర‌సంగంపై బొత్స స‌త్య‌నారాయ‌ణ నేడు శాస‌న‌ మండ‌లిలో స్పందించారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో త‌ల్లికి వంద‌నం ప‌థ‌కంలో భాగంగా రూ.15 వేలు రాష్ట్రంలో ప్ర‌తి విద్యార్థికి అందించిన‌ట్లు చెప్పార‌ని బొత్స తెలిపారు. అయితే అన్ని జిల్లాల్లో చాలామందికి స‌గం నిధులు మాత్ర‌మే అందిన‌ట్లు ఆరోపించారు.

సుమారు 18 శాతం మందికి రూ.7 వేల నుంచి రూ.8 వేల మ‌ధ్య మాత్ర‌మే నిధులు అందిన‌ట్లు తెలిపారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో బ‌కాయిలు చెల్లించాల్సి ఉంద‌ని వెల్ల‌డించారు. త‌ను మాట్లాడిన దాంట్లో త‌ప్పు ఉంటే.. త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకొని స‌భాముఖంగా క్ష‌మాప‌ణ చెప్తాన‌ని స‌వాల్ విసిరారు. బొత్స (Botsa Satyanarayana) వ్యాఖ్య‌ల‌పై అధికార పార్టీ స‌భ్యులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో కొద్దిసేపు స‌భ‌లో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు ఏర్పడ్డాయి.

 Read Also: అసెంబ్లీలో నారా దేవాన్ష్‌పై జ‌న‌సేన ఎమ్మెల్యే పొగ‌డ్త‌ల వ‌ర్షం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>