శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానానికి బాంబు బెదిరింపు

క‌లం, వెబ్ డెస్క్‌: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ (Shamshabad Airport)లో విమానానికి బాంబు బెదిరింపు రావ‌డం క‌ల‌క‌లం రేపింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ లోని శంషాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉన్న‌ట్లు ఆగంత‌కుడు ఈమెయిల్ ద్వారా బెదిరింపుల‌కు గురి చేశాడు. అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ అధికారులు, భ‌ద్ర‌తా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. అధికారుల త‌నిఖీల్లో ఓ అనుమానాస్పద బొమ్మ ల‌భ్య‌మైంది. దాన్ని సేక‌రించి క్ష‌ణ్ణంగా ప‌రీక్షించారు. బొమ్మ‌లో ఎలాంటి ప్ర‌మాద‌క‌ర వ‌స్తువులు ల‌భించ‌లేదు. దీంతో స‌ద‌రు బొమ్మ‌ను ఎవ‌రైనా ప్ర‌యాణికులు మ‌రిచిపోయి ఉండ‌వ‌చ్చ‌ని అధికారులు భావిస్తున్నారు. ఇక బెదిరింపు మెయిల్‌కు సంబంధించి అధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>