కలం, ఇచ్చోడ: ఇచ్చోడ మండల (Ichoda Mandal) కేంద్రంలో కొనసాగుతున్న ప్రధాన రహదారి, సెంట్రల్ డివైడర్ నిర్మాణ పనులను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చోడ ప్రధాన రహదారితో పాటు అన్ని కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నామని తెలిపారు. సెంట్రల్ లైటింగ్‌తో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి ఇచ్చోడను సుందరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

