ఇండియా కూటమి నేతలపై దౌర్జన్యాన్ని సహించం: మహబూబ్​నగర్ డీసీసీ అధ్యక్షులు

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, ప్రియాంక గాంధీలతోపాటు ఇండియా కూటమి (INDIA Bloc) ఎంపీలపై లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ “భారత ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే” కార్యక్రమం మహబూబ్‌నగర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షులు అంగంపల్లి సంజీవ్ ముదిరాజ్ హాజరై మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ఓటు హక్కు పవిత్రమైనదని, ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ప్రజల ఓటు హక్కుకు భంగం కలిగించే ఎలాంటి చర్యలను కాంగ్రెస్ పార్టీ సహించదని స్పష్టం చేశారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో అనేక అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయన్నారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పోయి ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయడం సరికాదని అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడటం, ప్రతి ఓటుకు గౌరవం కల్పించడం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని సంజీవ్ ముదిరాజ్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బాలకోటి, డీసీసీ కమిటీ సభ్యులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, మినాజుద్దీన్, రాములు యాదవ్, M.A. కలీమ్, TPCC అధికార ప్రతినిధి జాహిర్ అక్తర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వినోద్ కుమార్, ఎన్ పి వెంకటేష్, టౌన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ అలీ, మీడియా సెల్ సి.జె బెనహర్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పసుల రాజు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఆవేజ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, జిల్లా మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షులు గోనెల శ్రీనివాస్, కార్పొరేటర్లు ప్రవీణ్ కుమార్, మెగ్యా నాయక్, గులాం జాహిర్, షబీర్, మండల అధ్యక్షులు తనేం సుధాకర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>