కలం, కరీంనగర్: భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు నిర్వహిస్తున్న “హర్ ఘర్ తిరంగా యాత్ర” కార్యక్రమంలో భాగంగా భారత త్రివిధ దళాల్లో సేవలందించి పదవీ విరమణ పొందిన మాజీ సైనికుడు దూరిశెట్టి కిరణ్ కుమార్ (Durishetty Kiran Kumar)ని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ డా. బోగ శ్రావణి (Boga Shravani) వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా డా. బోగ శ్రావణి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు భారత సైనికులు చేస్తున్న త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన దూరిశెట్టి కిరణ్ కుమార్ గారు భారత త్రివిధ దళాల్లో సుమారు 19 సంవత్సరాల పాటు విశిష్ట సేవలందించారని పేర్కొన్నారు.
కార్గిల్ యుద్ధ సమయంలో దేశ రక్షణ కోసం ధైర్యంగా పోరాడుతూ తీవ్రంగా గాయపడి, తన ఎడమ కన్నును కోల్పోయినా కూడా దేశ సేవ పట్ల అంకితభావంతో విధులు నిర్వర్తించడం ప్రతి భారతీయుడికి ఆదర్శప్రాయమని కొనియాడారు. ఇటువంటి వీర జవాన్ల సేవలను సమాజం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని, వారి త్యాగస్ఫూర్తి యువతకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్, కౌన్సిలర్ నిమ్మల నాగరాజు, ఆముదరాజు, గదాసు రాజేందర్, పవన్ సింగ్, జున్ను సంతోష్, సిరిపురం శ్రీనివాస్, కశెట్టి తిరుపతి, ఇట్యాల రాము, కొక్కుల ప్రభాకర్, ముద్దం నాగరాజు, గడ్డల లక్ష్మి, మామిడాల కవిత, చెన్నడి మధురిమ, దూరిశెట్టి శ్రీనివాస్, పుప్పాల శివ, దొంగలి విజయ్, దూరిశెట్టి రమణ తదితరులు పాల్గొన్నారు.

