కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) రూరల్ మండలం అనంతపేట్ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన “ఫ్రైడే–డ్రై డే” (Friday-Dry Day) కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి గ్రామస్తులకు పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. వర్షాకాలంలో నీటి తొట్టెలు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు తదితర వస్తువుల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు.
పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటే డెంగీ, మలేరియా వంటి వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. అనంతరం అనంతపేట్, నీలాయిపేట గ్రామాల్లో గ్రామస్తులకు తడి చెత్త, పొడి చెత్త సేకరణ కోసం చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు సునీత, సుమలత, పంచాయతీ కార్యదర్శులు కృష్ణ, వీణ గ్రామస్థులు పాల్గొన్నారు.

