జగిత్యాల పట్టణ బీజేపీ ఇన్‌చార్జిగా కాశెట్టి తిరుపతి నియామకం

కలం, జగిత్యాల: భారతీయ జనతా పార్టీని జగిత్యాల పట్టణంలో మరింత బలోపేతం చేయడం, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం లక్ష్యంగా బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా కాశెట్టి తిరుపతిని భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ ఇన్‌చార్జిగా నియమిస్తూ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

కాశెట్టి తిరుపతి నాయకత్వంలో జగిత్యాల పట్టణంలో పార్టీ సంస్థాగత నిర్మాణం మరింత బలోపేతం అవుతుందని, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ విధానాలు,ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని పార్టీ నాయకులు తెలిపారు. ఈ నియామకంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ కాశెట్టి తిరుపతికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, కార్యకర్తల సంక్షేమానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కాశెట్టి తిరుపతి అంకితభావంతో పనిచేస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>