కలం, వెబ్ డెస్క్ : నేపాల్ వరదల్లో (Nepal Floods) చిక్కుకున్న లేదా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ప్రత్యేక హెల్ప్ లైన్, సమన్వయ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
నేపాల్‌లో ఉన్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించేందుకు తెలంగాణ భవన్ అధికారులు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో పాటు ఇతర సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తున్నారు.
నేపాల్‌లో ఉన్న తెలంగాణకు చెందిన యాత్రికులు, పర్యాటకులు లేదా ఇతర వ్యక్తులతో సంప్రదింపులు జరపలేకపోతున్న కుటుంబ సభ్యులు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. హెల్ప్‌లైన్ నంబర్లు: వందన – 9871999044, చక్రవర్తి – 9949351270, రక్షిత్ నాయక్ – 9618597969 ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

