మొక్కలకు రాఖీ.. అన్నాసాగర్ బడిలో వృక్ష సందేశం

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజల్లో అవగాహన కలిగించేందుకు భూత్పూర్ (Bhuthpur) మండల పరిధిలోని అన్నాసారగ్ మండల పరిషత్ ఉన్నత పాఠశాల ఏకో క్లబ్ ఆధ్వర్యంలో వృక్షాబంధన్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. శుక్రవారం సెలవు కావడంతో రాఖీ పౌర్ణమి వేడుకలను వినూత్నంగా జరుపుకున్నారు.

పాఠశాల బడి తోటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ఉపాధ్యాయులు జ్యోతి శారద విజయలక్ష్మి తో పాటు విద్యార్థులు బడి తోటలోని మొక్కలకు రాఖీలు కట్టి వేడుకలు జరుపుకున్నారు.

వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని ప్రతి ఒక్కరూ బాధ్యతతో మొక్కలు నాటి సంరక్షించాలని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అన్నారు. రాబోయే తరాలకు మంచి వాతావరణాన్ని బహుమతిగా ఇవ్వాలన్నారు. ఎలినో వంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే తప్పకుండా మొక్కలను విరివిగా నాటాల్సిన అవసరం ఉందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>