కలం, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కేటీపీపీ (Bhupalpally KTPP) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తదితర బీఆర్‌ఎస్ నాయకులను కేటీటీపీ లోపలికి వెళ్లకుండా పోలీసులు బారీకేడ్లు పెట్టి అడ్డుకున్నారు.
దీంతో పోలీసులకు, బీఆర్‌ఎస్ నేతలకు మధ్య తోపులాట జరిగింది. కేటీపీపీ వద్దకు బీఆర్‌ఎస్ నేతలు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నాయకులను అడ్డుకోవడంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్ నేతలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

