Mobile Popup Ad
Mobile Popup Ad

అశ్వారావుపేటలో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై బాలుడు అఘాయిత్యం

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట (Aswaraopeta)లో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలుడు, నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఉగాది సందర్భంగా గురువారం సెలవు కావడంతో బాలుడు నాలుగేళ్ల చిన్నారితో ఆడుకున్నాడు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయమై చిన్నారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలుడిపై పోక్సో (POCSO) కేసు నమోదైంది. పిల్లలకు ఫోన్లు ఇవ్వడంతోనే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. అశ్లీల కంటెంట్ పిల్లలు చూడకుండా కఠిన చట్టాలు చేసినపుడే నేరాలను నియంత్రించవచ్చునని అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>