కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలే రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Graduate MLC Elections) పార్టీ విజయానికి ప్రధాన బలమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పేర్కొన్నారు. ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి(Sarvotham Reddy)ని భారీ మెజారీటీతో గెలిపించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
శనివారం ఖమ్మంలో నిర్వహించిన పార్టీ సన్నాహక సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ, పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. గతంలో ఓటరుగా నమోదైన వారు కూడా ఈ ఎన్నికల నిబంధనల ప్రకారం మళ్లీ నమోదు చేసుకోవాల్సి ఉన్నందున, అర్హులైన ప్రతి పట్టభద్రుడినీ ఓటరుగా చేర్పించే బాధ్యతను కాంగ్రెస్ శ్రేణులు తీసుకోవాలని కోరారు.
శాసనసభ, మండల, గ్రామ స్థాయిల్లో వరుస సమావేశాలు నిర్వహిస్తూ పక్కా కార్యాచరణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత సన్నబియ్యం పంపిణీ, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ మరియు త్వరలో ప్రారంభం కానున్న ‘ఇందిరమ్మ బీమా’ వంటి పథకాల ప్రయోజనాలను కరపత్రాల ద్వారా ప్రతి ఇంటికీ వివరించి, గ్రాడ్యుయేట్ల మద్దతు కూడగట్టాలని ఆయన (Bhatti Vikramarka) స్పష్టం చేశారు.
Also Read : ఫ్లై దుబాయ్ హైజాకింగ్ ఘటన.. ఎన్ఐఏ దర్యాప్తు!
Follow Us On: Youtube

