ఫ్లై దుబాయ్ హైజాకింగ్ ఘటన.. ఎన్ఐఏ దర్యాప్తు!

కలం, వెబ్ డెస్క్: దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానం (Flydubai Flight) హైజాకింగ్ ఘటనపై భారత్ కూడా దృష్టి పెట్టింది. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. యాంటీ హైజాకింగ్, యూఏపీఏ చట్టాల కింద కేసు నమోదు చేసింది. భారత్‌కు చెందిన పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై దాడి చేసి ఫ్లైట్ హైజాక్ చేయడం లేదా క్రాష్ చేయాలనే కుట్ర దాగి ఉందని పేర్కొంది. దీనిపై ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. విదేశాల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తు చేయడం ఆసక్తికరంగా మారింది. భారత పైలట్‌ను టార్గెట్ చేసుకోవడం వెనుక ఇతర కారణాలేవైనా ఉన్నాయా..? అనేది పరిశోధించబోతున్నారు.

కోలుకుంటున్న స్మిత్ మచ్ఛర్..

కో–పైలట్ అల్–హమ్మామి దాడిలో తీవ్రంగా గాయపడిన పైలట్ స్మిత్ మచ్ఛర్ (Smit Machchhar) వేగంగా కోలుకుంటున్నాడని యూఏఈ ప్రభుత్వం వెల్లడించింది. ఆయన తలలో బలమైన చీలిక రావడంతో ఎమర్జెన్సీ ఆపరేషన్ నిర్వహించారని, ప్రస్తుతం ఆయన కొద్దికొద్దిగా నడుస్తూ.. ఆహారం తీసుకుంటున్నారని పేర్కొంది. నిపుణులైన వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని స్పష్టం చేసింది. యూఏఈలోని భారత ఎంబసీ అధికారులు కూడా నిరంతరం మచ్ఛర్ కుటుంబంతో టచ్‌లో ఉంటున్నారు. సెప్టెంబర్ 30న టెల్ అవీవ్ వెళ్తున్న విమానాన్ని కో–పైలట్ అల్–హమ్మామి హైజాక్ చేసి కూల్చేందుకు ప్రయత్నించాడు. ఈ కుట్రను పైలట్‌గా ఉన్న స్మిత్ మచ్ఛర్ అడ్డుకుని.. ప్రాణాలకు తెగించి 174 మంది కాపాడారు.

Also Read : కాఫీ షాప్‌లో సీఎం విజయ్, రాహుల్ సందడి!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>