బాసరలో మూలా నక్షత్రం వేడుకలు.. భద్రతపై ఏఎస్పీ సమీక్ష

కలం, బాసర: మూలా నక్షత్రం (Moola Nakshatram) సందర్భంగా ఈ నెల 16న బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలని భైంసా ఏఎస్పీ సాయికిరణ్‌ అధికారులను ఆదేశించారు. వేడుకల నేపథ్యంలో శనివారం ఆలయ పరిసరాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

భక్తుల రద్దీని నిరంతరం పర్యవేక్షిస్తూ క్యూ లైన్లను క్రమబద్ధీకరించాలని, ట్రాఫిక్‌ నియంత్రణ, పార్కింగ్‌ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బాసర ఇన్‌స్పెక్టర్‌ దీపక్‌, ముథోల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌, ఆలయ ఈవో అంజనాదేవి, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>