భద్రాద్రి కొత్తగూడెంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం.. ఇక ఫుల్ నిఘా

​కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు నిర్వహించేందుకు పోలీసు శాఖ చర్యలు వేగవంతం చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసింగ్ సమర్థవంతంగా నిర్వహించేందుకు ముందడుగు వేసింది. ఇందులో భాగంగా చుంచుపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సోమవారం ప్రారంభించారు.

​ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల భద్రతే ధ్యేయంగా జిల్లాలో నిఘా వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలతో పాటు పోలీస్ స్టేషన్లలోని కెమెరాలను ఈ సెంటర్‌కు అనుసంధానించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మొత్తం 467 సీసీటీవీ కెమెరాలు ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పరిధిలోకి వచ్చాయన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలను తక్షణమే గుర్తించి, అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించేందుకు వీలవుతుందని వివరించారు.

​రానున్న రోజుల్లో ప్రజల రక్షణ కోసం మరిన్ని కీలక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ రూమ్‌కు అనుసంధానించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నేరాల నియంత్రణలో సీసీటీవీ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు ఈ వ్యవస్థ దోహదపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ​అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో అధికారులతో కలిసి ఎస్పీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణతోపాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>