‘శక్తి పాలసీ’ని వెనక్కి తీసుకోవాలి.. భద్రాద్రి కొత్తగూడెం AISF డిమాండ్

​కలం, ఖమ్మం బ్యూరో: సాంకేతిక విద్యను నిర్వీర్యం చేసే జీవో నం.97 ను తక్షణమే రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ‘శక్తి పాలసీ’ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించింది. ​ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు ఎస్.కె. షాహిద్, అజిత్ మాట్లాడారు.

పాలిటెక్నిక్ వ్యవస్థను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకోవాలని కోరారు. ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యార్థులు ఈసెట్ రాసే అర్హత, కార్పొరేట్ కంపెనీల్లో తక్కువ వేతనాలకే పని చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 1957 నుంచి ఎంతో మంది నిపుణులను అందించిన పాలిటెక్నిక్ వ్యవస్థను కాపాడుకునేందుకు పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ లో పరిపాలన అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు వినయ్, సంజయ్, ఉమామహేశ్వర్, రాజు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>