కలం, భద్రాచలం: భద్రాచలం (Bhadrachalam) నాయి బ్రాహ్మణ సేవా సంఘం (Nayi Brahmin Seva Sangam) ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు కడియాల సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంఘం బలోపేతం, నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కార్యకర్తలతో విస్తృతంగా చర్చించారు. సమావేశం అనంతరం జిల్లాలోని పలు డివిజన్ కమిటీలను అధికారికంగా ప్రకటించారు. ఇందులో భాగంగా భద్రాచలం డివిజన్ అధ్యక్షుడిగా అందుర్తి క్రాంతిని ఏకగ్రీవంగా నియమించారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు అందుర్తి క్రాంతి మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధితో పాటు నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. అందుర్తి క్రాంతి నియామకం పట్ల భద్రాచలం డివిజన్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు, సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు.

