భద్రాచలంలో పుష్కరాల ఏర్పాట్లు వేగవంతం

​కలం, ఖమ్మం బ్యూరో: ​భద్రాచలంలో గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu) ఏర్పాట్లు, సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని సమీక్షించారు. ​ఆలయ ఉత్తర, దక్షిణ ప్రాంతాల అభివృద్ధి, ఘాట్ల నిర్మాణాలు, రహదారుల విస్తరణను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఐటీసీ నుంచి భద్రాచలం బ్రిడ్జి వరకు మూడు కిలోమీటర్ల మేర రోడ్డు సుందరీకరణకు వారం రోజుల్లో ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.

200 మంది కార్మికులు, 10 ప్రత్యేక బృందాలతో పనులను నిరంతరం కొనసాగించాలన్నారు. జూన్ 27 నుంచి జూలై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని మౌలిక వసతులు కల్పించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట దేవస్థానం ఈవో దామోదర్ రావు, ఆర్అండ్‌బీ ఈఈ నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>