కలం, ఆలేరు: అశ్వరావుపల్లి ప్రాజెక్టు నుంచి ఆలేరు మీదుగా టంగుటూరు, గోలనుకొండ గ్రామాలకు సాగునీరు అందించే కాల్వను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా కాల్వలో నీటి ప్రవాహాన్ని తక్షణమే పెంచి, చివరి పాము (టెయిల్ ఎండ్) భూములకు కూడా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. రైతుల సాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాల్వల ద్వారా తగినంత నీరు విడుదల చేయాలని సూచించారు. టంగుటూరు, గోలనుకొండ గ్రామాల రైతులకు నీటి కొరత లేకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించి, ఎదురయ్యే సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నీటి యాజమాన్యాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.

