Mobile Popup Ad
Mobile Popup Ad

ఐపీఎల్ ఫ్యాన్ పార్క్స్ 2026 షెడ్యూల్ ఇదే..!

క‌లం, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభ దశకు అనుగుణంగా, తొలి మూడు వీకెండ్స్‌లో నిర్వహించే ఐపీఎల్ ఫ్యాన్ పార్క్స్ (IPL Fan Parks) షెడ్యూల్‌ను బీసీసీఐ (BCCI) తాజాగా ప్రకటించింది. స్టేడియాలకు వెళ్లలేని అభిమానుల కోసం మ్యాచ్ అనుభూతిని నేరుగా వారి నగరాలకే తీసుకురావాలని బోర్డు నిర్ణయించింది. ఈ క్రమంలో 11 రాష్ట్రాల్లోని 15 నగరాల్లో ఈ ప్రత్యేక ఫ్యాన్ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. తొలి వారం మార్చి 28, 29 తేదీల్లో హర్యానాలోని రోహ్‌తక్, మధ్యప్రదేశ్‌లోని భోపాల్, మహారాష్ట్రలోని నాగ్‌పూర్, కర్ణాటకలోని తుమకూరు, పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్‌లో ఇవి ప్రారంభమవుతాయి.

రెండో వారం ఏప్రిల్ 4, 5 తేదీల్లో ఉత్తరప్రదేశ్ లోని మథుర, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్, తెలంగాణలోని నిజామాబాద్, కర్ణాటకలోని మైసూరు, ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఫ్యాన్ పార్కులు (IPL Fan Parks) సందడి చేయనున్నాయి. మూడో వారం ఏప్రిల్ 11, 12 తేదీల్లో మీరట్, నడియాడ్, రత్నగిరి, కోయంబత్తూర్, రూర్కెలా నగరాల్లో అభిమానులకు ఈ అవకాశం దక్కుతుంది. ఈ ఫ్యాన్ పార్కులలో కేవలం లైవ్ మ్యాచ్ స్క్రీనింగ్ మాత్రమే కాకుండా, సంగీతం, వినోద కార్యక్రమాలు, ఫుడ్ కోర్టులు కూడా ఉంటాయి.

పిల్లల కోసం ప్లే జోన్లు, వర్చువల్ బ్యాటింగ్, ఫేస్ పెయింటింగ్, 360 డిగ్రీల ఫోటో బూత్‌లు వంటి ఆకర్షణీయమైన ఏర్పాట్లు చేయనున్నారు. 2015లో ప్రారంభమైన ఈ ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ విధానం దేశవ్యాప్తంగా లీగ్ పరిధిని విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. తదుపరి వారాలకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ త్వరలోనే వెల్లడించనుంది.

Read Also: 41 దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ కొంటున్నాం : ప్రధాని మోదీ

Follow Us On: X(Twitter)

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>