బంగాళాఖాతంలో అల్పపీడనం: వాతావరణ శాఖ కీలక ప్రకటన!

కలం, వెబ్ డెస్క్ : ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం నాటికి ఇది బలపడి, తదుపరి మూడు నుంచి నాలుగు రోజుల్లో మరింత తీవ్రరూపం దాల్చే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ బుధవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశముంది. ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు పయనించే సూచనలు ఉన్నాయి. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం (Rain Alert) ఉందని అధికారులు తెలిపారు. కోస్టల్ ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>