కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం

కలం, బాసర: తెలంగాణలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల (Contract Lecturers) సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కాంట్రాక్ట్ అధ్యాపకుల ఉద్యమ కార్యాచరణ కమిటీ ప్రకటించింది. మంగళవారం బాసర ఆర్జీయూకేటీలో (Basara RGUKT) అధ్యాపకులు నల్ల బ్యాడ్జీలు (Black Badges) ధరించి విధులకు హాజరవుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ జనరల్ సెక్రటరీ డాక్టర్ కె. కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఉన్నత విద్యాభివృద్ధికి సేవలందిస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజేషన్ లేదా అబ్జార్ప్షన్ ద్వారా క్రమబద్ధీకరించాలని, యూజీసీ పే స్కేల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ఈ నెల 19న యూనివర్సిటీల్లో నిరసన ర్యాలీలు, 20న మానవహారాలు, 21న పరిపాలనా భవనాల ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఉద్యమంలో 12 యూనివర్సిటీల కాంట్రాక్ట్ అధ్యాపకులందరూ ఐక్యంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>