దొంతంపల్లి ఫర్నీచర్ షాపులో భారీ అగ్నిప్రమాదం!

కలం, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని దొంతంపల్లి (Donthanpally) గేట్ సమీపంలోని ఏవన్ ఫర్నీచర్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి షాపు మొత్తం వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో షాపులోని ఫర్నీచర్ పూర్తిగా కాలిపోయింది.

షాపు నుంచి దట్టమైన పొగలు, భారీ ఎత్తున మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే షాపు యజమానికి, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది దాదాపు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదం తెల్లవారు జామున జరగడంతో దుకాణంలో ఎవరూ లేరు. ఫలితంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>