కలం, మహబూబ్నగర్ బ్యూరో: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్లోని (Mahabubnagar) సాందీపని ఆవాసంలో చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. బండి సంజయ్ కుమార్ ఆయురారోగ్యాలతో, సంపూర్ణ శక్తిసామర్థ్యాలతో దేశానికి, తెలంగాణకు మరిన్ని సేవలు అందించాలని భగవంతుడిని ప్రార్థించారు. బీజేపీ సోషల్ మీడియా రాష్ట్ర నాయకులు మఠం మయుర్నాథ్, యువ మోర్చా రాష్ట్ర నాయకులు గౌని సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దోమ సాయి కుమార్, పృథ్వీ చారి, శేఖర్, విష్ణు, అభిలాష్, నవీన్ పాల్గొన్నారు.

