కలం, సినిమా : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Balakrishna), స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్‌లో మరో ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘NBK111’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కొత్త షెడ్యూల్ జూన్ 7 నుంచి ముంబైలో ప్రారంభం కానుంది. సినిమా టీమ్ జూన్ 10న, బాలయ్య పుట్టినరోజు సందర్భంగా చిత్ర టైటిల్‌తో పాటు టీజర్‌ను కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ స్పెషల్ అప్డేట్‌తో అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ కాంబినేషన్‌పై మంచి హైప్ ఉండగా, తాజా షెడ్యూల్, టీజర్ రిలీజ్ ప్లాన్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన క్యూట్ బ్యూటీ కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. బాలయ్య స్టైల్ ఆఫ్ మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో దర్శకుడు గోపిచంద్ మాలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

