కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన వాహనాలకు వేలంపాట (Vehicle Auction) నిర్వహించగా రూ. 37,760 వేల ఆదాయం సమకూరినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వేముల శ్రీనివాస్ తెలిపారు.
మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో ఐదు మోటార్ సైకిళ్లకు వేలం వేయగా రూ.32 వేలు, జీఎస్టీ రూ.5,760తో కలిపి మొత్తం రూ.37,760 ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎన్. బిక్షపతి, ఎస్సై వసంతరావు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

