వ్యాపారస్తులకు కేంద్రం శుభవార్త.. GST రద్దులో కీలక మార్పు!

కలం, వెబ్ డెస్క్ : వ్యాపారస్తులు, పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఇకపై GST రిజిస్ట్రేషన్ రద్దు (GST Registration Cancellation) చేసుకోవడాన్ని మరింత సులభతరం చేస్తూ CGST నిబంధనలు-2017లోని రూల్ 20లో కీలక సవరణలు చేసింది. దీనివల్ల అర్హులైన పన్ను చెల్లింపుదారులు దరఖాస్తు చేసుకున్న వెంటనే, GST అధికారుల పరిశీలన లేదా ఆమోదంతో సంబంధం లేకుండానే కామన్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్ రద్దు అవుతుంది.

అయితే GST రిజిస్ట్రేషన్ రద్దు కోసం దరఖాస్తు చేసుకున్న వారు సంబంధిత రిటర్నులు ఫైల్ చేసి, పన్నులు, వడ్డీ, జరిమానాలు సహా అన్ని బకాయిలు చెల్లించి ఉండాలి. ఈ నిబంధనలన్నీ సక్రమంగా పూర్తి చేసిన వారికి, వారు కోరుకున్న తేదీ నుంచే రిజిస్ట్రేషన్ రద్దయినట్లుగా ఎలక్ట్రానిక్ విధానంలో FORM GST REG-38 ద్వారా సమాచారం అందుతుంది. ఒకవేళ దరఖాస్తుదారులు ఏవైనా రిటర్నులు పెండింగ్‌లో ఉంచినా లేదా పన్ను బకాయిలు చెల్లించకపోయినా, ఆ దరఖాస్తులు ఆటోమేటిక్‌గా రద్దు కాకుండా సంబంధిత GST అధికారి పరిశీలనకు వెళ్తాయి. ఈ కొత్త నిబంధనలు డిసెంబర్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>