PHCలో సురక్షిత ప్రసవం.. మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ

కలం, సూర్యాపేట: ఆత్మకూరు(ఎస్) మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (Atmakur (S) PHC) వైద్యులు, సిబ్బంది సమర్థవంతంగా వైద్యసేవలు అందిస్తూ మరో విజయవంతమైన ప్రసవం నిర్వహించారు. ఆత్మకూర్ (ఎస్) గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి (29, రెండవ కాన్పు) అనే మహిళ గురువారం పురిటి నొప్పులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరారు. డ్యూటీ వైద్యాధికారిణి డాక్టర్ రమ్య తన వైద్య సిబ్బందితో కలిసి వెంటనే స్పందించి, ఆపరేషన్ అవసరం లేకుండానే ఆమెకు సురక్షితంగా సాధారణ ప్రసవం చేశారు. దీంతో భాగ్యలక్ష్మి ఆరోగ్యకరమైన మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి, నవజాత శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యురాలు డాక్టర్ రమ్య వెల్లడించారు.

సకాలంలో స్పందించి మెరుగైన వైద్యసేవలు అందించిన డాక్టర్ రమ్యతో పాటు నర్సింగ్ ఆఫీసర్ మానస, ఓపీ ఏఎన్ఎమ్ మహబూబా, ఆత్మకూర్ ఏఎన్ఎమ్ అన్నపూర్ణ, ఆశా వర్కర్ మాధవి, సిహెచ్‌ఓ యాదగిరి, హెల్త్ అసిస్టెంట్ కొండా శ్రీనుతో కూడిన బృందాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు మనస్ఫూర్తిగా అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన వైద్య సేవలను, సౌకర్యాలను గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వైద్య సిబ్బంది కోరారు. వైద్య సేవలు అందిస్తూ, కాన్పులను విజయవంతం చేస్తున్న డాక్టర్ రమ్యని, ఆసుపత్రి సిబ్బందిని మండల ప్రజలు కొనియాడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>