అథచమయం ప్రదర్శనతో ఓనం సంబరాలు షురూ!

కలం, వెబ్ డెస్క్ : కేరళలో పది రోజుల పాటు సాగే ప్రతిష్ఠాత్మక ఓనం పండుగ (Onam Festival) సంబరాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. త్రిప్పుణిత్తుర పట్టణంలో జరిగిన అథచమయం ప్రదర్శనతో ఈ వేడుకలు అధికారికంగా షురూ అయ్యాయి.

అలంకరించిన ఏనుగుల ఊరేగింపు, నయన మనోహరమైన ఫ్లోట్లు, సాంప్రదాయ జానపద నృత్యాలు ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కొచ్చి రాజవంశం కాలం నుండి అథచమయం వేడుకల ద్వారా త్రిప్పుణిత్తుర మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొని ఈ సంబరాలను విజయవంతం చేశారు.

Also Read : తిరుమలకు తీసిపోని తిరుమలయ్య గుట్ట..!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>