కలం, కరీంనగర్ బ్యూరో : జగిత్యాల (Jagtial) జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం దారుణ సంఘటన చోటుచేసుకుంది. గాంధీనగర్ ప్రాంతంలో కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తపై అల్లుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… TR నగర్‌కు చెందిన కట్ట ప్రశాంత్ (35) అనే వ్యక్తి, తన అత్త నక్క నరసవ్వ (55) పై కత్తితో దాడి చేశాడు.
భార్య లక్ష్మితో తనకు మనస్పర్థలు రావడం, భార్య తనతో కలిసి ఉండకపోవడం, విడాకుల వ్యవహారానికి అత్త నరసవ్వే కారణమని ప్రశాంత్ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆమెపై తీవ్రంగా దాడి చేశాడు. గాయపడిన మహిళను కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read : సీఎంను చంపేస్తానంటూ బెదిరింపు.. అప్రమత్తమైన అధికారులు!
Follow Us On : WhatsApp

