ఒకే రోజు రెండు పతకాలు సాధించిన భారత షూటర్

కలం, స్పోర్ట్స్: ఆసియా గేమ్స్‌లో(Asian Games 2026) భారత షూటర్ ఎలావెనిల్ వలరివన్ (Elavenil Valarivan) అద్భుత ప్రదర్శనతో ఒకే రోజు రెండు రజత పతకాలు సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆమె రజతం కైవసం చేసుకుంది. 24 షాట్ల ఫైనల్లో తొలి 20 షాట్ల వరకు ఎలావెనిల్ అగ్రస్థానంలో కొనసాగింది. అయితే చివరి నాలుగు షాట్లలో జపాన్ షూటర్ తైచి హినాటా గట్టి పోటీ ఇచ్చింది. హినాటా 253.0 పాయింట్లతో గేమ్స్ రికార్డుతో స్వర్ణ పతకం సాధించగా, ఎలావెనిల్ 252.4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకుంది. దక్షిణ కొరియాకు చెందిన బాన్ హ్యోజిన్ కాంస్య పతకం సాధించింది. అంతకుముందు జరిగిన టీమ్ ఈవెంట్‌లో ఎలావెనిల్ వలరివన్, సోనమ్ మస్కర్, విదార్సా వినోద్‌లతో కలిసి రజత పతకం సాధించింది. టీమ్ విభాగంలో రజతం గెలిచిన కొన్ని గంటల్లోనే వ్యక్తిగత విభాగంలోనూ రజతం సాధించడం విశేషం.

మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఫైనల్‌కు మూడో స్థానంలో అర్హత సాధించిన మరో భారత షూటర్ సోనమ్ మస్కర్ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. 2010 ఆసియా గేమ్స్‌లో గగన్ నారంగ్ తర్వాత 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రజతం సాధించిన రెండో భారతీయ షూటర్‌గా ఎలావెనిల్ నిలిచింది. ఆసియా గేమ్స్ తొలి రోజే రెండు రజత పతకాలు సాధించి ఎలావెనిల్ వలరివన్ భారత షూటింగ్‌కు శుభారంభం అందించింది. ఆమె ప్రదర్శనపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>