సబలెంకా క్షమాపణలు.. అసలేం జరిగింది?

కలం, స్పోర్ట్స్: టెన్నిస్‌ స్టార్‌ అరినా సబలెంకా (Aryna Sabalenka) తన కోర్టు ప్రవర్తనపై క్షమాపణలు చెప్పారు. డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో ఉక్రెయిన్‌ ప్లేయర్‌ ఎలీనా స్వితోలినా చేతిలో ఓడిన తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. అయితే తన ఆగ్రహం స్వితోలినాపై కాదని సబలెంకా స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సబలెంకా 3-6, 6-3, 1-6తో ఓడిపోయారు. ఈ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించారు. మ్యాచ్‌ సమయంలో ఆమె ఆగ్రహంగా మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఆమె వ్యాఖ్యలు స్వితోలినాను, ఉక్రెయిన్‌ ప్రజలను ఉద్దేశించినవిగా కొందరు భావించారు.

దీనిపై స్పందించిన సబలెంకా.. తన తప్పులకు కొందరు ప్రేక్షకులు గట్టిగా సంబరాలు చేసుకోవడంతో అసహనం వ్యక్తం చేశానని తెలిపారు. ఆ సమయంలో భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయానని అంగీకరించారు. తన ప్రవర్తనతో బాధపడిన వారికి క్షమాపణలు చెప్పారు. స్వితోలినా ఆటను ప్రశంసించారు. 2022లో రష్యా దాడి తర్వాత రష్యా, బెలారస్‌ ఆటగాళ్లతో స్వితోలినా కరచాలనం చేయడం లేదు. ఈ నేపథ్యం కూడా తాజా వివాదంపై చర్చకు కారణమైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>