ఆర్మీని హార్పిక్‌తో అవ‌మానించింది.. ట్రోలింగ్ దెబ్బ‌కు సారీ చెప్పింది!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఇటీవ‌ల ఢిల్లీలో నీట్ పేప‌ర్ లీకేజీకి నిర‌స‌న‌గా, కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ నిర‌స‌న‌ల్లో శాంతి భ‌ద్ర‌త‌ల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు భ‌ద్ర‌తా ద‌ళాలు క్షేత్ర స్థాయిలో ప‌ని చేశాయి. ఈ సంద‌ర్బంగా ఓ యువ‌తి సైనికుల‌తో వ్య‌వ‌హ‌రించిన తీరు తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. ఢిల్లీలోని జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న‌ల్లో పాల్గొన్న‌యువ‌తి విధుల్లో ఉన్న సైనికుల‌తో ఇన్‌స్టా రీల్ త‌ర‌హాలో ఓ వీడియో తీసుకుంది. సైనికుల అనుమ‌తి లేకుండా, వారికి తెలియ‌కుండానే ఈ రీల్ షూట్ చేసింది. త‌ర్వాత‌ దీనికి హార్పిక్ యాడ్‌కు సంబంధించిన ఆడియోను జోడించి త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ వీడియో కాస్తా కొద్ది సేప‌ట్లోనే వైర‌ల్‌గా మారింది. ఆర్మీని అవ‌నించ‌డంపై నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నెటిజ‌న్ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డంతో యువ‌తి కొన్ని గంట‌ల్లోనే స‌ద‌రు వీడియోను డిలీట్ చేసింది. అయితే అప్ప‌టికే వీడియో డౌన్‌లోడ్ చేసుకున్న కొంద‌రు మీమ‌ర్స్ దాన్ని తెగ స‌ర్క్యూలేట్ చేశారు. సైనికుల‌కు ఇచ్చే గౌర‌వం ఇదేనా? అంటూ ఆ యువ‌తిని విమ‌ర్శించారు. ఈ ట్రోలింగ్ తాకిడి పెర‌గ‌డంతో యువ‌తి మ‌ళ్లీ ఓ స్పెష‌ల్ వీడియో చేసింది. ఇందులో త‌ప్పు చేశానంటూ ఆర్మీకి సారీ చెప్తూ క‌న్నీళ్లు పెట్టుకుంది. అలాగే తాను ఎప్పుడూ ఆర్మీని, పోలీసుల‌ను అవ‌మానించ‌లేద‌ని, ఈ వీడియో పోస్ట్ చేసి పొర‌పాటు చేశాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

త‌న వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంట‌ల్లోనే డిలీట్ చేశాన‌ని, అయితే కొంద‌రు మీమ‌ర్స్ కేవ‌లం ఫేమ‌స్ కావ‌డం కోసం, లైక్స్ కోసం త‌న వీడియోను డౌన్‌లోడ్ చేసుకొని వాడుకుకుంటున్నార‌ని చెప్పింది. ఈ వీడియోల కింద కామెంట్ల‌లో త‌న‌ను, త‌న కుంటుంబాన్ని అంద‌రూ తిడుతున్నార‌ని క‌న్నీళ్లు పెట్టుకుంది. స‌ద‌రు మీమ్ పేజీల వాళ్ల‌కు ఫోన్ చేసి వీడియో తొల‌గించాల‌ని కోరిన‌ట్లు తెలిపింది. అయితే త‌మ‌కు డ‌బ్బులు వ‌చ్చాయ‌ని, ఈ వీడియో తొల‌గిండ‌చం కుద‌ర‌ని వాళ్లు అంటున్నార‌ని చెప్పింది. ఫాలోవ‌ర్లు, డీపీ లేని అకౌంట్‌ల నుంచి త‌న పోస్టులు, వీడియోల‌పై నీచ‌మైన కామెంట్లు పెడుతున్నార‌ని, ఒక కుట్ర ప్ర‌కారం ఇదంతా జ‌రుగుతోంద‌ని చెప్పింది. అంద‌రూ త‌ప్పులు చేస్తార‌ని, తాను తెలియ‌క చేసిన పొర‌పాటుకు ఇంత‌లా వేధించ‌డం స‌రికాద‌ని చెప్పింది. ఇప్ప‌టికైనా త‌న‌ను, త‌న కుటుంబాన్ని బ్యాడ్ కామెంట్ల‌తో వేధించ‌డం ఆపేయాల‌ని కోరింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>