కలం, వెబ్ డెస్క్ : మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే కోడూర్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar) వ్యవహారంపై జనసేన (Janasena) పార్టీ విచారణ కమిటీ వేసింది. ఏడు రోజుల్లోగా ఈ కమిటీ విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా అరవ శ్రీధర్ విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. రైల్వే కోడూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఈ విచారణ జరుగుతుంది. ఎమ్మెల్యే వివరణతో పాటు, స్థానిక నేతలు, కార్యకర్తల అభిప్రాయాలు కూడా తెలుసుకోనున్నారు.
Read Also: ప్రైవసీతో ఆటలొద్దు.. ‘మెటా’ డేటా చోరీపై సుప్రీం ఆగ్రహం
Follow Us On : WhatsApp


