కలం, వెబ్‌డెస్క్: నేటి నుంచి ఏపీ టెట్ (AP TET) పరీక్షలు జరుగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2.14 లక్షల మంది అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 16 వరకు టెట్ పరీక్షలు కొనసాగనున్నాయి. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న టీచర్లకు కూడా ప్రభుత్వం టెట్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సారి 74,711 మంది ఇన్‌సర్వీస్ టీచర్లు కూడా పరీక్ష రాయనున్నారు. పరీక్షలు ముగిసిన అనంతరం ఈ నెల 24న కీ విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 15న తుది ఫలితాలు వెల్లడి చేస్తారు. త్వరలో మరో డీఎస్సీ కూడా ప్రకటిస్తామని ఇటీవల మంత్రి నారా లోకేశ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ టెట్ ప్రాధాన్యత సంతరించుకుంది.

