Mobile Popup Ad
Mobile Popup Ad

ఘోర రోడ్డు ప్రమాదం.. టిప్పర్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, ముగ్గురి మృతి

కలం, వెబ్ డెస్క్ : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న టిప్పర్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన విశాఖలోని గాజువాక (Gajuwaka Bus Accident) శ్రీనగర్ వద్ద జరిగింది.

వివరాల్లోకి వెళ్తే… రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు శ్రీనగర్ వద్దకు రాగానే ఆగి ఉన్న టిప్పర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ రాంబాబుతో పాటు ఈశ్వరమ్మ అనే ప్రయాణికురాలు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరోకరు మరణించినట్లు సమాచారం అందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>