Mobile Popup Ad
Mobile Popup Ad

విద్యార్థులకు అలర్ట్.. రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు

కలం, వెబ్ డెస్క్ : ఏపీ ఇంటర్ ఫలితాలు (AP Inter Results) రేపు విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. బుధవారం ఉదయం 10:31 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను వెల్లడించనున్నట్లు ప్రకటించారు. విద్యార్థులు ఫలితాలను https://resultsbie.ap.gov.in వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చని అన్నారు. అలాగే మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 కు జస్ట్ “Hi” అని సందేశం పంపి ఫలితాలను వెంటనే తెలుసుకోవచ్చని వెల్లడించారు. ఈ సందర్భంగా ఇంటర్ విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ ‘ఆల్ ది బెస్ట్’ తెలిపారు.

కాగా, ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23 న ప్రారంభమై మార్చి 23 న ముగిశాయి. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్ లో తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా పరీక్షల నిర్వహణకు దాదాపు నెల రోజుల సమయం పట్టింది. తాజాగా మూల్యాంకనం పూర్తి కావడంతో రేపు ఫలితాలను రిలీజ్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ సిద్ధం అయింది. ఇదిలాఉంటే తెలంగాణలో ఇప్పటికే ఇంటర్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>