కలం, వెబ్ డెస్క్: ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. నక్కపల్లి మహిళా ఎస్సై సాహిబా అంజుమ్‌కు మంత్రి తన నివాసంలో ఘనంగా సీమంతం చేశారు. ఈ సందర్భంగా అంజుమ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. పుట్టబోయే బిడ్డ, తల్లి ఇద్దరూ క్షేమంగా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
ఈ సీమంతానికి సంబంధించిన ఫోటోలను హోంమంత్రి అనిత (Vangalapudi Anitha) తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసుకున్నారు. ఖాకీ యూనిఫాం వెనుక కూడా ఎన్నో అందమైన జీవిత కథలు ఉంటాయని, విధి నిర్వహణలో అంకితభావంతో సేవలందిస్తున్న ప్రతి మహిళా పోలీసు సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు అని అనిత తన పోస్టులో పేర్కొన్నారు. హోం మంత్రిగా బాధ్యతలు నిర్వర్విస్తూ ఓ అధికారిణి పట్ల ఆమె చూపిన ఈ ఆదరణ, గౌరవం పట్ల అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Also: అమరావతికి మళ్లీ వస్తాం.. దేవినేని అవినాశ్ కీలక ప్రకటన
Follow Us On: Instagram

