Mobile Popup Ad
Mobile Popup Ad

మ‌హిళా సాధికార‌తే ప్ర‌భుత్వ ల‌క్ష్యం: హోం మంత్రి అనిత‌

క‌లం, వెబ్ డెస్క్‌: మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, గౌర‌వం, సాధికార‌తే కూట‌మి ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత (Minister Anitha) వెల్ల‌డించారు. నేడు అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం (International Womens Day) సంద‌ర్భంగా హో మంత్రి మ‌హిళ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిజ‌యేశారు. ఎంతోమంది మ‌హిళ‌లు సమాజ ప్రగతిలో భాగ్య స్వామ్యుల‌య్యార‌ని పేర్కొన్నారు. మహిళా శక్తికి సాటిలేద‌ని, ప్రతి అడుగులో ధైర్యం, ప్రతి సంకల్పంలో దృఢత్వం వెలకట్టలేనివ‌ని చెప్పారు. సమాజ ప్రగతిలో మహిళల పాత్ర అద్భుతమైన మార్పుకు నాంది ప‌లుకుతుంద‌న్నారు. ఆడబిడ్డల భద్రత, గౌరవం, సాధికారత కోసం నిరంతరం శ్రమిస్తూ, వారి కలలు సాకారమయ్యే దిశగా అడుగులు వేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమ‌ని స్ప‌ష్టం చేశారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి, నవ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం అవుదామ‌ని అని పిలుపునిచ్చారు.

మ‌హిళా ఆరోగ్యమే కుటుంబానికి ఆరోగ్యం అని హోంమంత్రి అన్నారు. కుటుంబ ఆరోగ్యం స‌మాజానికి పునాది అని చెప్పారు. మ‌హిళ‌లు ఈ రోజుల్లో బ్రెస్ట్ క్యాన్స‌ర్ వంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నార‌ని, ప‌ని ఒత్తిడిలో ప‌డి త‌మ గురించి తాము ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఆరోగ్యం గురించి ఆలోచించాల‌ని మ‌హిళ‌ల‌కు సూచించారు. ప్ర‌భుత్వం అన్ని ర‌కాలుగా స‌హ‌కరిస్తుంద‌ని హామీ ఇచ్చారు. ఈ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌తి మ‌హిళ త‌న ఆరోగ్య‌మే మ‌హా భాగ్యంగా ముందుకు వెళ్లాల‌ని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>