పవన్ ఆదేశాలు.. హస్తకళకు ప్రత్యేక క్యూఆర్ కోడ్

కలం, వెబ్ డెస్క్: ఏపీలో హస్తకళకు (AP Handicrafts) ప్రాధాన్యం పెరిగేలా కూటమి ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు హస్తకళలను ప్రపంచంలో ఎక్కడినుంచైనా ఆస్వాదించేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకువచ్చింది. అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు లేపాక్షి ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టింది. కళారూపం పూర్తి వివరాలు తెలిసిలే, కళాకారుడికి తగిన గుర్తింపు లభించేలా దేశంలోనే హస్తకళలకు క్యూఆర్ కోడ్ వేసే ప్రక్రియను ప్రారంభించింది.

హస్తకళా నైపుణ్యాన్ని ఒక్క స్కాన్‌తో పూర్తి వివరాలు తెలుసుకునేలా క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చారు. కొనుగోలుదారులు వస్తువుపై ఉన్న కోడ్‌ను ఫోన్ లో స్కాన్ చేస్తే ఆ కళాఖండానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆన్లైన్ లో చూడవచ్చు. ఆ వస్తువు చరిత్ర, సాంస్కృతిక విశిష్టత, కళాకారుడి పేరు, వారి నైపుణ్యం, వంటి అనే వివరాలు తెలుసుకోవచ్చు.అలాగే దానికి భౌగోళిక గుర్తింపు లేదా ఒక జిల్లా–ఒక ఉత్పత్తి గుర్తింపు ఉందా అనే సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది. అయితే ఇందుకు సంబంధించి తొలి దశలో రాష్ట్రంలోని విభిన్న సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచే 8 ఐకానిక్ హస్తకళా ఉత్పత్తులకు క్యూఆర్ కోడ్ ప్రొఫైల్స్‌ సిద్ధం చేశారు.

రాష్ట్రంలోని ప్రసిద్ధ బొబ్బిలి వీణతోపాటు, సంపూర్ణ రామాయణం, శ్రీ మహాభారతం, శ్రీ కృష్ణలీలా, మత్స్యావతారం కలంకారి పెయింటింగ్స్, సవర ఆదివాసి పెయింటింగ్స్ కి తొలుత ప్రాధాన్యమిచ్చారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని హస్తకళా ఉత్పత్తులు, కళాకారుల క్లస్టర్లకు ఈ విధానాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నిర్ణయంతో ఏపీ హస్తకళలకు ప్రపంచ మార్కెట్‌లో మరింత గుర్తింపుతోపాటు కళాకారుల ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ వినూత్న కార్యక్రమం ద్వారా నకిలీ ఉత్పత్తులకు అడ్డుకట్ట వేయవచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>