కలం, వెబ్ డెస్క్: ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా (Sidharth Luthra)కు ఏపీ ప్రభుత్వం రూ.33 లక్షల నిధులు విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వానికి చెందిన ఓ కేసుకు సంబంధించి నిధులు విడుదల చేస్తూ జీవో విడుదల చేసింది. ఇది క్రిమినల్ కేసు నెంబర్ 21/2024లో ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి విజయవాడలో ఆయన ప్రాతినిథ్యం వహించినందుకు గాను చెల్లిస్తున్నట్లు పేర్కొంది. జీవోలో కేేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించకపోయినప్పటికీ ఇది ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన అంశంగా తెలుస్తున్నది. ఈ చెల్లింపు కోసం గతంలో ఉన్న కొన్ని ప్రభుత్వ ఆదేశాల్లోని నిబంధనలను సడలించారు. ఫీజు మొత్తం రూ.30 లక్షలు ఉండగా ఇందులో 10 శాతం క్లర్క్ చార్జ్ కలిపి మొత్తం రూ.33 లక్షలుగా అంచనా వేశారు. ప్రస్తుతం ఈ చెల్లింపు ఆమోదానికి సంబంధించి అన్ని పద్ధతులు పూర్తి చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లిక్కర్ కేసుకు సంబంధించి గతంలోనూ ఏపీ ప్రభుత్వం సిద్ధార్థ్ లూథ్రాకు భారీగా ఫీజు చెల్లించింది.
Read Also : బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్..!
Follow Us On: Pinterest

